![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో అయిదు వారాలు పూర్తయింది. అయిదో వారం శ్రీజ, ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అవ్వగా.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. నిఖిల్ నయ్యర్, అయేషా, దువ్వాడ మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ గా అయిదో వారం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వచ్చీ రాగానే దువ్వాడ మాధురి పొగరుగా మాట్లాడింది. కెప్టెన్ చెప్పేది వినకుండా రూడ్ గా మాట్లాడింది. అది హాట్ టాపిక్ గా మారగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో అందరి అంచనాలకి మించి ఉంది.
రాము రాథోడ్, రీతూ చౌదరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇద్దరు సంఛాలక్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని చెప్పాలి కదా అని రీతూ అనగా.. మీకు ఇమ్మాన్యుయల్ అన్న చెప్పాడు.. నేను మీరు ఆడేది రాంగ్ అని చెప్పాను.. మీ వల్ల అందరు అలానే ఆడారంటూ రాము రాథోడ్ చెప్పాడు. ఇక ఆ తర్వాత భరణిని రీతూ నామినేట్ చేసింది. ఈ మనిషి మాటిస్తే అది మనకి ఉంటుందని నమ్మకం లేదంటూ భరణిని నామినేట్ చేయగా.. రాము, నువ్వు ఉంటే నేను రామునే సపోర్ట్ చేస్తానని భరణి అన్నాడు.
హౌస్ లోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నా.. మీకు దివ్య తప్ప ఇంకో ప్రపంచం లేనట్టు కనిపిస్తుందని భరణిని దువ్వాడ మాధురి అంది. సంజన వర్సెస్ భరణి నామినేషన్ పాయింట్లు చూసి బిబి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. భరణిని సంజన నామినేట్ చేసి.. నాకు దెబ్బ తగిలి కిందపడ్డప్పుడు మీ సపోర్ట్ ఏమైంది.. మీ హ్యుమానిటీ ఏమైందని సంజన అడుగుతుంది. హ్యుమానిటీ అన్న టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను సంజన గారు.. మీరు మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తులు మాట్లాడేది కూడా తీసుకోవాలని భరణి అన్నాడు.
![]() |
![]() |